బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము ప్రాముఖ్యం కానె కాదయ్యా...
అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయమూ...
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా ఆ......
స్వల్ప గ్రామమైన బెత్లహేము నుండి యూదా సింహమూ.....
దీనురాలైన మరియ గర్భాణా ఆది వాక్యమూ....
మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెనూ.... ।।2।।
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా . ఆ......
ఎలే......ఎలె ఎలెలే. ।।2।।
ఎలో ఎలె ఎలే..... ।।3।।
ఎలె ఎలె ఎలోలే....... ।।3।।
సొంత కుమారుని అప్పగించేను వెనుతీయక మన కొరకు...
ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడవరకు.....
పాపమై పరిశుద్ధుడు పాపికి విలువ నిచ్చెను.
।।2।।
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా ..
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము ప్రాముఖ్యం కానె కాదయ్యా...
అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయమూ...