ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను (2)
మార్గము నీవే సత్యము నీవే (2)
జీవము నీవే నా ప్రభువా (2) -ఆరాధించెద
విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును (2)
సరిదిద్దితివి నా జీవితము (2)
నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) -ఆరాధించెద
నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి (2)
నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)
నిత్యము నిన్ను కొనియాడెదను (2) -ఆరాధించెద
పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ (2)
లెక్కింపగజాలని జనమందున (2)
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) -ఆరాధించెద|
Aaraadhincheda Ninu Madi Pogadeda
Nirathamu Ninu Sthuthiyinchedanu (2)
Maargamu Neeve Sathyamu Neeve (2)
Jeevamu Neeve Naa Prabhuvaa (2) -Aaraadhincheda
Visthaarambagu Vyaapakamulalo
Vidachithi Nee Sahavaasamunu (2)
Sarididdithivi Naa Jeevithamu (2)
Ninu Sevimpaga Nerpina Prabhuvaa (2) -Aaraadhincheda
Nee Rakthamutho Nanu Kadigithivi
Parishudhdhunigaa Jesithivi (2)
Nee Rakshanakai Sthothramu Cheyuchu (2)
Nithyamu Ninnu Koniyaadedanu (2) -Aaraadhincheda
Peddalu Parishudhdhulu Ghana Doothalu
Nee Sannidhilo Nilachinanu (2)
Lekkimpagajaalani Janamanduna (2)
Nanu Gurthinthuvu Naa Priya Prabhuvaa (2) -Aaraadhincheda