ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు (2)
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా (2)
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో||
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా (2)
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా||
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై (2)
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా||
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2) ||యేసయ్యా||
Aashatho Nee Koraku Eduru Choochuchundagaa
Noothana Balamutho Nanu Nimpinaavu (2)
Balaheenulanu Balaparachuvaadaa
Krungina Vaarini Levaneththuvaadaa (2)
Yesayyaa Naa Aashrayamaa
Yesayyaa Neeke Aaraadhana (2) ||Aashatho||
Sommasillaka Adugulu Thadabadaka
Nadicheda Nee Venta Jeevithamanthaa (2)
Lokamu Nannu Aakarschinchinaa
Venudirugaka Nenu Saageda Nee Venta (2) ||Yesayyaa||
Alayaka Nenu Parugeththedanu
Anthamu Varaku Aathmala Rakshanakai (2)
Siddhdhamu Chesina Bahumaanamukai
Guriyoddake Nenu Saagedanayyaa (2) ||Yesayyaa||
Rekkalu Chaapi Pakshi Raaju Valene
Paikegereda Nee Parishuddhulatho (2)
Paravashinchedanu Nee Mukhamunu Choochi
Pranamilleda Nee Paadamula Chentha (2) ||Yesayyaa||