ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము

Dhanyamu Entho Dhanyamu

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము||

ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||

క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||

ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు||

ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు||

శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||

Dhanyamu Entho Dhanyamu – Yesayyanu Kaligina Jeevithamu (2)
Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2)
Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2) ||Dhanyamu||

Evari Athikramamulu – Pariharimpabadeno (2)
Evari Paapamulu Manninchabadeno (2) ||Vaare Dhanyulu||

Kreesthu Yesuku Samarpinchu – Karamule Karamulu (2)
Kreesthu Yesu Swaramu Vinu – Veenule Veenulu (2) ||Vaare Dhanyulu||

Prabhu Yesuni Seva Cheyu – Paadamule Sundaramulu (2)
Prabhuni Goorchi Paatapaadu – Pedavule Pedavulu (2) ||Vaare Dhanyulu||

Aathmalo Nithyamu – Eduguchunna Vaarunu (2)
Apavaadi Thanthramulu – Gurthinchu Vaarunu (2) ||Vaare Dhanyulu||

Shramalayandu Nilachi – Paaduchunna Vaarunu (2)
Shathru Baanamulella – Chedaragottu Vaarunu (2) ||Vaare Dhanyulu||