ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం||
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం||
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం||
Ee Udayam – Shubha Udayam
Prabhuve Naakosagina – Aananda Samayam
Aashrayinchedan – Divya Vaakyamun
Premathoda Sari Chesi – Sreshta Sathyamun ||Ee Udayam||
Balaheenamaithi Nenu – Balaparchumu Thandri
Phalaheenamaithi Nenu – Phaliyimpajeyumu
Vaakya Dhyaaname – Nee Mukha Darshanamu
Parishuddha Parachedi – Parama Thandri Maargamu ||Ee Udayam||
Asthiramunaithi Nenu – Sthiraparachumu Thandri
Alpa Vishwaasi Nenu – Addariki Jerchumu
Nee Paada Sannidhe – Naaku Sharanmu
Abhayambunichchedi – Aashrayapuramu ||Ee Udayam||