ఎంత జాలి యేసువా

Entha Jaali Yesuvaa

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను ||ఎంత||

హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2)
ఆదరించినావుగా ||ఎంత||

రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2)
చావొందితివి నాకై ||ఎంత||

ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెత్తి (2)
స్తొత్రమంచు పాడెద ||ఎంత||

నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై (2)
నాథుడా నీ విచ్చు మేలు (2)
ఎంత గొప్పదేసువా ||ఎంత||

నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు (2)
నిశ్చయముగ నీవు నాకు (2)
ఇచ్చువాడా ప్రభువా ||ఎంత||

నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు (2)
నాదు కాపరివి నీవు (2)
నాకు లేమి లేదుగా ||ఎంత||

అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా (2)
హల్లెలూయ స్తోత్రములను (2)
హర్షముతో పాడెద ||ఎంత||

Entha Jaali Yesuvaa
Inthayani Oohinchalenu ||Entha||

Haanikaruda Himsakudanu
Devadooshakudanu Nenu (2)
Avishwaasinaina Nannu (2)
Aadarinchinaavugaa ||Entha||

Rakshakundaa Naaku Badulu
Shiksha Nanubhavinchaavu (2)
Siluvayandu Sommasilli (2)
Chaavondithivi Naakai ||Entha||

Emi Neekarpinchagalanu
Emi Lenivaadanayyaa (2)
Rakshanampu Paathranetthi (2)
Sthothramanchu Paadeda ||Entha||

Needu Naamamunaku Ilalo
Bhayapadedu Vaari Korakai (2)
Naathudaa Neevichchu Melu (2)
Entha Goppadesuvaa ||Entha||

Nenu Brathuku Dinamulanni
Kshemamella Velalandu (2)
Nischayamuga Neevu Naaku (2)
Ichchuvaadaa Prabhuvaa ||Entha||

Naadu Praanamunaku Prabhuvaa
Sedadeerchu Vaada Veevu (2)
Naadu Kaaparivi Neevu (2)
Naaku Lemi Ledugaa ||Entha||

Andarilo Athi Sreshtundaa
Advitheeyudagu Yesayyaa (2)
Hallelooya Sthothramulanu (2)
Harshamutho Paadeda ||Entha||