గొర్రెపిల్ల వివాహోత్సవ

Gorrepilla Vivaahothsava

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి (2)

సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||

దేవుని వాక్యమను నామము గలవాడు (2)
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi (2)

Sarvaadhikaariyu Sarvonnathundaina (2)
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla||

Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2)
Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla||

Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2)
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla||

Thellani Gurramupai Koorchundinavaadu (2)
Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla||

Devuni Vaakyamanu Naamamu Galavaadu (2)
Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla||

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2)
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla||

Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2)
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||