ఇదియే సమయంబు రండి యేసుని జేరండి

Idhiye Samayambu Randi

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి

పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక||

రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక||

బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక||

వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును ||ఇక||

సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ ||ఇక||

జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక||

Idiye Samayambu Randi Yesuni Jerandi
Ika Samayamu Ledandi – Randi Rakshana Nondandi

Paapulanandarini – Thana Daapuna Cherchutakai
Praanamu Daanamugaa Thana Praanamu Nichchenugaa
Maranapu Mullunu Virichi – Vijayamu Nichchenugaa ||Ika||

Raajula Raajaina Yesu Raanai Yundenugaa
Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi
Tharunamundagaane – Meeru Thayyaaravvandi ||Ika||

Budhdhi Leni Kanyakavale – Moddulugaanunte
Siddelalo Noone Posi – Sidhdhapadakapothe
Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandi ||Ika||

Velupatanuntenu Meeru Vedana Nondedaru
Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandee
Mimmunu Eruganu – Meerevaro Pommanunu ||Ika||

Sandiya Padikandi – Meeru Saakulu Cheppakanu
Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi
Marana Dinamoo Mana – Merugamu Summandee ||Ika||

Jaalamu Cheyakanu – Meeru Helana Cheyakanu
Kulamu Sthalamanuchoo – Meeru Kaalamu Gaduvakanoo
Tharunamundagaane – Meeru Thvarapadi Raarandi ||Ika||