నన్ను తాకుము పరిశుద్ధపరచుము
విమోచిచు నా ప్రియ ప్రభు పరిశుద్ధపరచుము
1. లోకము నుండి లోకపుబంధాల నుండి
పాపము నుండి పాపపు క్రియల నుండి
విడిపించుము నా ప్రియ ప్రభు
ఐక్యపరచుము
నీలో నన్ను ఐక్యపరచుము
2. నూతన హృదయంబు నాకిమ్ము దేవా
నిజమైన నీ పోలిక దయచేయుమయ్యా
విజయంబు నిచ్చి నడిపించుమా
స్వస్థపరచుము
నీలా నన్ను రూపుదిద్దుము
3. వేలిగించుము నన్ను ఈ లోకములో
విలువైన వానిగా నను మార్చుము
ఉన్నత స్థలములో నను నిల్పుము
శక్తి నొసగుము
సర్వోన్నతుడా నీ జ్ఞానమీయ్యుము