పేదనరుని రూపము ధరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను
1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడే
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండే
2. తలవాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరక లేదు
తన్ను ఆధరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను
3. మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిలా
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విస్వాసముతో