సంతోషించుమా ఓ యెరుషలేమా

Santhosinchuma

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

సంతోషించుమా ఓ యెరుషలేమా
సర్వోన్నతుని జనాంగమా
ఆనందించుమా సియోను నగరమా
ఉత్సహించి పాడుమా
షాలోం.. షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

1. భూరాజులందరు నిన్ను గూర్చి
ఒక దినము ఇలలో సంతోషించును
అంజుర వృక్షమైన నీ చేతి కొమ్మలు
చిగురించి ఫలియించును
షాలోం.. షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము

2. సర్వలోకమంతయు నీ ద్వారా
ఆశీర్వదించ బడియుండెను
నీలోన పుట్టిన రక్షకుడు
లోకాన్ని రక్షించెను
షాలోం.. షాలోం యెరుషలేమా
సమాధానము నిత్యం నీకు సమాధానము